05-05-2025 12:59:33 AM
హాజరైన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, బీజేపీ ఎంపీ అభ్యర్థి పోర్టుగంటి భరత్
అచ్చంపేట మే 4: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మహా త్రిపుర సుందరి స్వరూపమైన గ్రామ బొడ్రాయి (నాభిశీల) పున:ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, బిజెపి ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
పూర్వం ప్రతిష్టించిన ఈ బొడ్రాయి నాభిషిలను కాలక్రమేనా రోడ్డు క్రిందకి వెళ్లడంతో తిరిగి ప్రత్యేక స్థానంలో పున ప్రతిష్టించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భారీ అన్నప్రసాద కేంద్రాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు పోచమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం భక్తి శ్రద్ధలతో బోనాలు చేసి పోచమ్మ, బొడ్రాయి లకు బోనాలతో కుంభం పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, రఘురాం, గౌరీ శంకర్, ఆకుల వెంకటేష్, భ్రమరాంబ టెంపుల్ అధ్యక్షుడు పోకల శ్రీధర్, కే వెంకటేష్, మాధవరావు, ఎం.బాలాజీ, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.