05-05-2025 12:55:46 AM
పెబ్బేరు ఎప్రిల్ 4: మండల పరిధిలోని అయ్యవారి పల్లి గ్రా మంలో ఆదివారం మైనార్టీ కు ట్టు మిషన్ ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన మహ్మద్ రజియా బేగం, మహ మూదా బేగం, షబానా బేగం లకు కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వారికి ప్రభు త్వం నుంచి ఏర్పాటు చేసిన మైనార్టీ పథకం ద్వారా కుట్టుమిషన్ లు అందజేశారు.
ఈ కార్య క్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు లక్ష్మన్ నాయుడు, ప్రభాకర్ గౌడ్, శేఖర్ శెట్టి, సురేష్, బాలరాజ్, భాస్కర్, సలీం, గులాం తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కి మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.