calender_icon.png 7 September, 2025 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఉపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ అంతటి గొప్పగా ఎదగాలి

06-09-2025 10:18:17 PM

63 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

విద్యార్థులకు ఉపాధ్యాయులు మనసు పెట్టి విద్యా బోధన చేయాలి  - ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి

విద్యార్థులకు భట్టి విద్య కాకుండా లాజిక్ నేర్పించండి - జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): ప్రతి ఉపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ అంతటి గొప్పగా ఎదగాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు మనసు పెట్టి విద్యా బోధన చేయాలి  - ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లా స్థాయి  ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలను శనివారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఇట్టి సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి హాజరై మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం ఒక అధ్యయనమన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి... మొదటగా ఆయన ఉపాధ్యాయుడిగా ప్రస్థానం మొదలై.. అంచలంచెలుగా ఎదిగి దేశానికి ప్రథమ పౌరుడిగా ఉన్నారన్నారు.

తన పుట్టినరోజును ""టీచర్స్ డే గా"" జరుపుకోవాలని సూచించడం ఉపాధ్యాయులకు గొప్ప గౌరవం అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం  జరుపుకోవడం అంటే ఉపాధ్యాయులకు ఇచ్చిన గౌరవమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యను అభ్యసించే సమయంలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని.. ఆయనకు క్షేత్రస్థాయిలో కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నతంగా ఎదిగారన్నారు. విద్యావ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని  అందులో భాగంగానే పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధ్యాయులకు పదోన్నతులు, కొత్త టీచర్ల నియామకం అన్నారు.

ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ (అంతర్జాతీయ ప్రమాణాలతో) ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి నూతన  విద్యా విధానం తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో వనపర్తి జిల్లా ఉత్తీర్ణత శాతం పెంచాలనీ.అందుకు ప్రతి ఉపాధ్యాయుడు మనసు పెట్టి బోధించాలని సూచించారు. అంతకుముందు కార్యక్రమంలో విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయానికి ప్రత్యేక గా నిలిచిన బోనాల పండుగ సంబంధించిన వేషధారణలతో ప్రత్యేక  నృత్య ప్రదర్శన ఎంతో ఆకట్టుకుంది. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాలకు ఎంపికైన 63 మంది   ఉపాధ్యాయులకు మెమెంటో, ప్రశంస పత్రంతో పాటు శాలువాతో సన్మానం చేశారు.