calender_icon.png 7 September, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజ హితమే జర్నలిస్టుల ధ్యేయం

06-09-2025 10:21:06 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): సమాజ హితమే ధ్యేయంగా జర్నలిస్టులు పనిచేస్తున్నారని విశ్రాంత మండల విద్యాధికారి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తేళ్ళ చెన్నయ్య అన్నారు. జర్నలిస్ట్ డే సందర్భంగా శనివారం ములకలపల్లిలోని శిశు మందిర్ విద్యాలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ కిన్నెరసాని  ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు రేపాక ప్రసాద్ అధ్యక్షతన జాతీయ జర్నలిస్ట్ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్, రీజియన్ సెక్రటరీ లయన్ కేదారేశ్వర రావు మాట్లాడారు.నేషనల్ జర్నలిస్టుడే సందర్భంగా పత్రికారంగంలో పాత్రికేయులుగా మండలంలో పనిచేస్తున్న సీనియర్ పాత్రికేయులు అయితా శేషగిరిరావు, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామ్మోహన్ రావు, గంట వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ లను లయన్స్ క్లబ్ ఆఫ్ పాల్వంచ కిన్నెరసాని ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.