calender_icon.png 7 September, 2025 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో 28 గంటల పాటు సాగిన గణేష్ శోభాయాత్ర

06-09-2025 10:12:06 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి గణేష్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు హైదరాబాద్ భాగ్య నగరం లో జరిగే గణేష్ శోభయాత్ర, నిమజ్జనాలను తలపించాయి. 350కి పైగా గణేష్ విగ్రహాలు శోభయాత్ర లో పాల్గొన్నాయి. గణేష్ మండపాల నిర్వాకులు, యువకులు, బ్యాండ్ మేళాలతో డ్యాన్సులు చేస్తూ గణనాథుని శనివారం రాత్రి గంగమ్మ చెంతకు పంపించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ లోని నాజ్ థియేటర్ సమీపంలో  యువజన సమాఖ్య గణేష్ విగ్రహానీకి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, కామారెడ్డి ఆర్డిఓ వీణ,మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, యువజన సమాఖ్య అధ్యక్షుడు రవీందర్ గౌడ్, పుల్లూరు సతీష్ లు కొబ్బరికాయలు కొట్టి శోభాయాత్ర శుక్రవారం రాత్రి 9:30 కు ప్రారంభించారు.

ఈ శోభాయాత్ర హైదరాబాద్ భాగ్యనగరంలో జరిగే విధంగా కామారెడ్డిలో గణేష్ శోభయాత్రను 28 గంటల పాటు నిర్వహించారు. కామారెడ్డికి చుట్టుపక్కల జిల్లాలకు  చెందిన భక్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల భక్తులు వేలాదిమంది పెద్ద ఎత్తున తరలివచ్చి శోభయాత్రలో పాల్గొన్నారు. జై బోలో గణేష్ మహరాజ్ కి అంటూ భక్తులు జయ జయ జ్వనాల ధ్వనాల మధ్య  గణనాథుల శోభయాత్ర ను ప్రారంభించారు. శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు గణనాథుల శోభయాత్ర కొనసాగింది. స్వయంసేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్ ్ వాలంటీర్లు, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన స్టేజి పైనుంచి గణనాథులకు స్వాగతం పలికారు. షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా భక్తులకు పులిహోర, నీరు  అందించారు.

కిరాణా వర్తక సంఘం, ఇతర వ్యాపారులు శనివారం భక్తులకు టిఫిన్ సౌకర్యంతో పాటు, మధ్యాహ్నం భోజనం సౌకర్యం కల్పించారు.గణనాథులను సిరిసిల్ల రోడ్డు, స్టేషన్ రోడ్డు, సుభాష్ రోడ్, జే పిఎన్ రోడ్డు, వీక్లీ మార్కెట్ రోడ్, మీది నుంచి పాంచరస్తా, గోపాల స్వామి రోడ్డు, పెద్ద బజార్, కమాన్ రోడ్, మీదుగా నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ రోడ్, మీదుగా అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో శనివారం అర్ధరాత్రి వరకు గణనాథులను ఒక్కొక్కటిగా తరలించి నిమజ్జనం నిర్వహించారు. పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు 300 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. అడ్లూరు ఎల్లా రెడ్డి పెద్ద చెరువు వద్ద ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు గజయితగాలను, రేస్క్యూ టీం ను, జెసిబిలను, భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. మున్సిపల్, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ సిబ్బంది తో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించడమే కాకుండా చెరువు వద్దకు వచ్చిన గణ నాథులను. వినాయక నిమజ్జనం కోసం సీరియల్ ప్రకారం నిమజ్జనం చేసేందుకు 28 గంటల పాటు శ్రమించారు.

వినాయక మండపాల నిర్వాహకులు డిజె సౌండ్, బ్యాండ్ మేళాలతో గణనాథులను ఘనంగా  డ్యాన్సులు చేస్తూ యువకులు గణనాథులను గంగమ్మ చెంతకు తరలించారు.కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణనాథుల నిమజ్జన శోభాయాత్ర జరిగే ప్రాంతాలలో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు  నిఘాలో గణనాథులను 28 గంటల పాటు  గణేష్ శోభాయాత్ర శోభాయామానంగా విద్యుత్ లైట్ అలంకరణతో గణనాథులను కామారెడ్డి సమీపంలోని అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు.నిమజ్జన ప్రాంతంలో భారీ క్రేన్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా గణనాథులను తీసి చెరువులో నిమజ్జనం చేశారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ స్థానిక అధికారులకు సూచనలు సలహాలు అందిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో కామారెడ్డిలో నిమజ్జనం నిర్వహించారు.