calender_icon.png 27 January, 2026 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసుపత్రి సూపరింటెండెంట్ తీరు ఆక్షేపనియం

27-01-2026 09:25:56 PM

తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)రాష్ట్ర కార్యదర్శి  పి.సురేష్

మహబూబ్ నగర్,(విజయక్రాంతి):  ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ రంగ అజ్మీర ఆస్పత్రి కార్మికుల పట్ల ఉద్యోగుల పట్ల అనుసరిస్తున్న తీరు ఆక్షేపనియం అమానుషమని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ యూనియన్ చేస్తున్న పోరాటాలలో చురుకుగా పాల్గొంటున్నారనే కక్షతోనే ఆస్పత్రి సూపర్ టెండెంట్ దేవానంద్ అకారణంగా ఎలాంటి విచారణ జరపకుండా చట్ట విరుద్ధంగా తొలగింపు సర్కులర్ ను ఇచ్చారని ఆ సర్కులర్ ను తక్షణమే ఎత్తివేయాలని సోమవారం నిరసన మంగళవారం నుండి చేపట్టబోయే నిరవధిక సమ్మె నోటీసును శనివారం ఆస్పత్రి ఆర్ ఎం ఓ లకు అందజేశారు. 

దేవానంద్ సంవత్సరాల తరబడి నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నాడని, కార్మికుల జీతభత్యాల పెంపు హక్కుల కోసం యూనియన్ పోరాటంలో లో చురుకుగా పాల్గొంటున్నాడనే కక్ష కట్టారని అన్నారు.దేవానంద్ గురువారం రాత్రి విధుల్లో ఉండగా తన డ్యూటీ టైం కు సంబంధంలేని ఫోటోలు కల్పించుకొని విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నడని ఆసుపత్రి సూపరిండెంట్ దేవానంద్ కు ఫోన్ చేశారని సూపరిండెంట్ కు తన విధులకు సంబంధించిన ఫోటోలు కావని కావాలనే నాపై ఇలాంటివి దుష్ప్రచారం చేస్తున్నారని సూపర్డెంట్ కు వివరించారు.

దీనే ఆసరాగా తీసుకొని సూపరింటెండెంట్ దూషించినట్లు చిత్రీకరించి అభియోగాలు మోపి సూపరిండెంట్ ఆదేశాల ప్రకారం సంబంధిత సాయి సెక్యూరిటీ ఏజెన్సీ సర్వీసెస్ వారు అక్రమంగా సంఘటనపై ఎలాంటి విచారణ జరపకుండా వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వకుండా తొలగింపు ప్రత్యేక సర్కులర్ ఇవ్వడం ఎంతో బాధాకరమని అన్నారు. ఆసుపత్రిలో తగినంత కార్మికుల సంఖ్య లేకుండా క్లీనింగ్ ఎలా సాధ్యమని అన్నారు. కార్మికులను ఉద్యోగులను సూపరిండెంట్ నోటికి వచ్చినట్టు ఆత్మగౌరవం దెబ్బతినేలా దూషణలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు.

ఆసుపత్రిలో ఎంత పనిచేసిన కార్మికులకు మాత్రం తగిన గుర్తింపు రాకపోగా నిందలు మాత్రం భరించలేనని మోపుతున్నారని మండిపడ్డారు.తక్షణమే తప్పుడు పద్ధతుల్లో విడుదల చేసిన తొలగింపు సర్కులర్ వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిచో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టి మంగళవారం నుండి సమ్మెలోకి దిగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి బ్రాంచ్ నాయకులు కార్మికులు బి.చెన్నయ్య, అంజి భీమయ్య, కృష్ణ, శ్రీను,  యాదయ్య తదితరులు పాల్గొన్నారు.