27-01-2026 09:28:21 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు నూతన డిఎస్పీగా యు.వెంకన్న బాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు పోలీస్ శాఖ ఉన్నత అధికారులు మంగళవారం ఇల్లందు డిఎస్పీగా వెంకన్నబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు వెంకన్నబాబు డి.ఎస్.పి ఇంటిలిజెన్సీ విభాగంలో పనిచేశారు. ఇల్లందు డీఎస్పీ గా పనిచేసిన చంద్రభాను బిజెపి కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వెంకన్న బాబు నియమితులయ్యారు.