27-01-2026 09:58:14 PM
మెట్ పల్లి,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నేటి నుండి మెప్మా భవనంలో అభ్యర్థుల నామినేషన్ లు స్వికరించడం జరుగుతుందని కమిషనర్ మోహన్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించుటకు గాను సోమవారం షెడ్యూల్ ప్రకటించడం జరిగినది.
ఈ షెడ్యూల్ లో భాగంగా నేటి నుండి 30వ తేది వరకు వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణ మున్సిపల్ కార్యాలయం ప్రక్కన గల మెప్మా భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకటి నుండి తొమ్మిదవ వార్డులకు సంబంధించి నామినేషన్ లు స్వికరించడం జరుగుతుంది. అలాగే మొదటి అంతస్తులో పదవ వార్డు నుండి ఇరవై ఆరవ వార్డు లకు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అన్నీ పార్టీల అభ్యర్థులు మెప్మా భవనం లో తమ నామీనేషన్ పత్రాలు సమర్పించాలని కమిషనర్ కోరారు.