calender_icon.png 27 January, 2026 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్తారం మండలంలో కాంగ్రెస్ నాయకుల సస్పెన్షన్ ఎత్తివేత

27-01-2026 09:51:20 PM

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలంలో ఇటీవల కాంగ్రెస్ నాయకుల సస్పెన్షన్ ఎత్తివేసినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పర సదానందం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ మంగళవారం బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ శాఖ  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు సీతంపేట గ్రామానికి చెందిన కూరాకుల పర్వతాలు,  ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బగ్గని మొగిలి, పోతారం, మచ్చు పేట, మైదంబండ గ్రామాలకు చెందిన నాయకులపై ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చేసిన సస్పెన్షన్ ను మంత్రి  ఆదేశానుసారం  సస్పెన్షన్ ఎత్తివేసి ఇక నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారని తెలిపారు.