calender_icon.png 27 January, 2026 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి

27-01-2026 09:44:32 PM

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులు తమ విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. నోడల్ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి సమావేశమై, వారి విధుల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... నోడల్ అధికారుల విధులు, బాధ్యతలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాబోయే ఎన్నికలకు నోడల్ అధికారుల నియామకం చేపట్టినట్లు తెలిపారు. మానవ వనరుల నిర్వహణ, శిక్షణ, రవాణా, మోడల్ కోడ్ కండక్ట్, ఖర్చు పర్యవేక్షణ, పోస్టల్ బ్యాలెట్, ఎలక్టోరల్ రోల్స్, ఎన్నికల పరిశీలకులు విషయమై నోడల్ అధికారుల నియామకం చేసినట్లు తెలిపారు. వివిధ అంశాలకు సంబంధించి నియామకం చేసిన నోడల్ అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలకు సంబంధించి అన్ని విధాలుగా సర్వ సన్నద్ధం కావాలన్నారు.

ఎన్నికల నిబంధనలు సమగ్రంగా చదివి అర్థం చేసుకోవాలని సూచించారు.ఎన్నికల నిర్వహణకు సరిపోను సిబ్బందిని సమకూర్చుకోవాలన్నారు.  పర్యవేక్షణ బృందాల రవాణాకు కావాల్సిన వాహనాలు సిద్ధపర్చుకోవాలన్నారు. వివిధ రకాలుగా జిల్లా యంత్రాంగానికి వచ్చే ఎన్నికల ఫిర్యాదులను వేగంగా, క్వాలిటీ పరిష్కారం చూపేలా సన్నద్ధం కావాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

షెడ్యూల్ వివరాలు

ఎన్నికల నోటిఫికేషన్ జారీ: 28-01-2026 (బుధవారం)

నామినేషన్ల స్వీకరణ: 28-01-2026 నుండి ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు.నామినేషన్ల 

దాఖలుకు చివరి తేదీ: 30-01-2026 (శుక్రవారం) సా.5.00 గంటల వరకు

నామినేషన్ల పరిశీలన: 31-01-2026 (శనివారం) ఉదయం 11.00 గంటల నుంచి

చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితా: 31-01-2026

నామినేషన్ తిరస్కరణపై అప్పీల్: 01-02-2026 (ఆదివారం) సా.5.00 గంటల వరకు.అప్పీల్స్ పరిష్కారం: 02-02-2026 (సోమవారం)

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: 03-02-2026 (మంగళవారం) సా.3.00 గంటల వరకు తుది అభ్యర్థుల జాబితా విడుదల: 03-02-2026

పోలింగ్ తేదీ: 11-02-2026 (బుధవారం) ఉదయం 7.00 నుంచి సాయంత్రం 5.00 వరకు

రీ–పోల్ (అవసరమైతే): 12-02-2026 (గురువారం)

ఓట్ల లెక్కింపు: 13-02-2026 (శుక్రవారం) ఉదయం 8.00 గంటల నుంచిఫలితాల ప్రకటన: ఓట్ల లెక్కింపు పూర్తైన తరువాత ప్రకటిస్తారు.సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, నోడల్ అధికారులు గీత, లక్ష్మణ్, శ్రీనివాసాచారి, జగన్ మోహన్ రెడ్డి, నవీన్, ప్రవీణ్, అన్సార్, మీర్జా ఫసహత్ అలీ బేగ్, శ్రీనివాస్, భారతి, మల్లికార్జున రావు, షర్ఫుద్దీన్, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.