27-01-2026 09:48:54 PM
షేక్ అవుతున్న అగ్రవర్ణ పార్టీల పునాదులు..!
బానిస సంకెళ్లు తెంచుకుందాం.. టిఆర్పి పార్టీతో ఒక్కటవుదాం..
వనపర్తి మున్సిపాలిటీపై ఎగిరేది మన జెండానే...!
ఘనంగా యువజన భవిష్యత్ కార్యవర్గ సమావేశం
రాష్ట్ర టిఆర్పి యూత్ అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్
మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జైపాల్
వనపర్తి,(విజయక్రాంతి): అబద్ధపు హామీలతో 78 ఏండ్లుగా దోపిడి చేస్తున్నారని,95% వున్నా బీసీ,ఎస్సీ, ఎస్టి, మైనార్టీలము పన్నులు టాక్స్లు కడుతుంటే దొడ్డి దారిన దోపిడి చేస్తూ బీసీలకు రాజ్యాంగ పలాలు అందకుండా బానిసలుగా మార్చుకుంటున్నారని రాష్ట్ర టిఆర్పి యూత్ అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం టిఆర్పి అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు యువజన కార్యవర్గ బలోపేతం సమావేశానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా యూత్ అధ్యక్షులు జి.రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ నినాదనంతో బహుజన రాజ్యం మొదలవడంతో, అగ్రవర్ణ పార్టీల పునాదులు కదులుతున్నాయని కోరారు. వనపర్తి గడ్డ బీసీల అడ్డా మున్సిపాలిటీ ఎన్నికల్లో వాడవాడలో ఎగిరేది టిఆర్పి జెండానే, పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీకి నియమా నిబద్ధతతో బాధ్యతగా అంకితభావంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు కేవలం పెత్తందార్ల చేతుల్లోనే ఉన్నాయని, రెడ్డిల ఆధీనంలో ఉన్న పార్టీలో బహుజన బిడ్డలు ఎంత కష్టపడినా ఆ పార్టీకి ఓనర్లు కాలేరాని అన్నారు.
ఏ పార్టీ ఎన్ని కుట్రలు చేసిన మున్సిపాలిటీలలో కత్తెర గుర్తు పోటీలో ఉంటుందని,బీసీ పార్టీ సత్తా చాటుతామని సూచించారు. అందుకు గాను బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనారిటీలు ఐక్యంగా పార్టీలో సైనికుల్లా కష్టపడుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి ముదిరాజ్ దయానంద్,వనపర్తి జిల్లా పార్టీ అధ్యక్షులు విజయ్ యాదవ్,కొత్తకోట మండలం యూత్ అధ్యక్షులు ఎండి రఫిక్ మరియు మండలాల అధ్యక్షులు,పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.