calender_icon.png 27 January, 2026 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పపెల్లి బ్రిడ్జి పనులు ప్రారంభించాలి

27-01-2026 10:01:24 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మండలంలోని మోతుగూడ నుంచి అప్పపెల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో గత కొంతకాలంగా నిలిచిపోయిన బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే పునఃప్రారంభించి పూర్తి చేయాలని కోరుతూ మంగళవారం ఎమ్మెల్యే  కోవ లక్ష్మికి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఇర్ధండి వినోద్‌, శ్రీధర్, తిరుపతి, చంద్రయ్య బ్రిడ్జి పనులు మధ్యలోనే నిలిచిపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యేకు  వివరించారు. ముఖ్యంగా వర్షాకాలంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయని తెలిపారు. బ్రిడ్జి పనులను పునఃప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి హామీ ఇచ్చారు.