27-01-2026 09:35:04 PM
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
జిల్లాలో ఒకే రోజు 38 మందికి కోర్టు శిక్షలు
10 మందికి ఒక రోజు జైలు శిక్షలు,
రూ.38,000 జరిమానా విధింపు
కామారెడ్డి,(విజయక్రాంతి): మద్యం సేవించి వాహనం నడిపితే అట్నే చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లాలో 38 మందికి ఒకేరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కోర్టు శిక్ష విధించిందన్నారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్లో 23 కేసులు నమోదు కాగా 23 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో ఆరుగురికి ఒకరోజు జైలు శిక్ష, ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు.
మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు కాగా వెయ్యి రూపాయల జరిమానా, భిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు, వెయ్యి రూపాయల జరిమానా, దోమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేసులు, ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున 4,000, ముగ్గురికి ఒకరోజు జైలు శిక్ష, బిబిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు కాగా వెయ్యి రూపాయల జరిమానా, తాడువాయి పోలీస్ స్టేషన్లో రెండు కేసులు, రెండు వేల జరిమానా, ఒక వ్యక్తికి ఒక రోజు జైలు శిక్ష విధించారు. 38 కేసుల్లో 38 వేల రూపాయల జరిమాణాలు 10 మందికి ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరు క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు. బాధ్యతాయుతమైన ప్రయాణమే మీ కుటుంబ భవిష్యత్తుకు అసలైన భరోసా హాని వాహనదారులకు హితవ్ పలికారు. క్షనికానందం కోసం మద్యం మత్తులో వాహనాలు నడిపి నిండు జీవితాలను రోడ్డు ప్రమాదాల పాలు చేయవద్దని కోరారు. ఒక చిన్న పొరపాటు వల్ల ఎన్నో కుటుంబాలు పెద్దదిక్కుని కోల్పోయి వీధిన పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని అన్నారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు.
మీ భద్రతే మా లక్ష్యం. మద్యం మత్తులో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీసు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు కోర్ట శిక్షలు విధించినంది . జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 38 మందిని సోమవారం కోర్టు ముందు హాజరుపరచగా, వారికి జైలు శిక్షలు మరియు జరిమానాలు విధించడం జరిగింది.
ఈ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కోర్టు మొత్తం 38 మందికి శిక్షలు విధించింది:
మొత్తంగా ఈ రోజు 38 కేసుల్లో ₹38,000 జరిమానాలు మరియు 10 మందికి కోర్టు ఒక రోజు జైలు శిక్ష విధించింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, మాట్లాడుతూ:
మద్యం సేవించి వాహనం నడపడం అనేది కేవలం చట్టవిరుద్ధమే కాకుండా, తోటి ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర తెలిపారు. క్షణికానందం కోసం మద్యం మత్తులో వాహనాలు నడిపి, నిండు జీవితాలను రోడ్డు ప్రమాదాల పాలు చేయవద్దని, మీ ఒక చిన్న పొరపాటు వల్ల ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని, బాధ్యతాయుతమైన ప్రయాణమే మీ కుటుంబ భవిష్యత్తుకు అసలైన భరోసా అని వాహనదారులకు హితవు పలికారు.