calender_icon.png 2 December, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరివేసుకుని గృహిణి ఆత్మహత్య

02-12-2025 03:13:48 PM

కల్వకుర్తి విద్యానగర్‌లో విషాదం

కల్వకుర్తి: కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్‌లో మాధవి (33) అనే గృహిణి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. విద్యానగర్ లో భర్త గౌతమ్ ముగ్గురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. సోమవారం సాయంత్రం భార్యాభర్తల మధ్య గొడవ కావడంతో క్షణికావేశంతో బెడ్ రూమ్ లోకి వెళ్లి చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. కొంత సమయం అయ్యాక భర్త పిల్లలు గమనించి మాధవిని ఎంత పిలిచినా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి గదిలోకి వెళ్లారు.

అప్పటికే ఫ్యానుకు ఉరివేసుకొని కనిపించడంతో వెళ్లి తీసేసరికి మృతి చెందింది.  సమాచారం అందుకున్న పోలీసు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల  ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త గౌతం నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ నిధులు నిర్వహిస్తున్నారు. మృతురాలికి ఇద్దరు బాలికలు, సంవత్సర వయసున్న కుమారుడు ఉన్నారు.