02-12-2025 03:17:58 PM
కొమురవెల్లి,(విజయక్రాంతి): తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం( తపస్) కొమరవెల్లి మండల శాఖ కార్యవర్గం ఎన్నికలు మంగళవారం నిర్వహించారు.ఈ ఎన్నిక సిద్దిపేట జిల్లాలో గల శిశుమందిర్ లో నిర్వహించారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికలలో అధ్యక్ష కార్యదర్శులుగా సల్లారం రామచంద్రారెడ్డి (తపాస్ పల్లి), ఇరుమల్ల రమేష్ (రామ్ సాగర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సల్లారం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సంఘం అప్పగించిన బాధ్యతలు సక్రమంగానే నిర్వహిస్తూ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ను మినాయింపు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.