15 April, 2026 | 3:16 AM

అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

15-04-2026 12:46 AM

ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి  

సూర్యాపేట, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన ఐ ద్వా జిల్లా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వ స్తే ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు కట్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవు తున్న రేవంత్ రెడ్డి నేటికీ ఏ ఒక్కరికి ఇల్లు నిర్మించిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలు సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక గ్రామంలో మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం సమంజసం కాదన్నారు. అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. ఇంటి స్థలం లేని వారికి కొనుగోలు చేసి ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీ నేటికి అమలు కాలేదు అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేతి వృత్తుదారుల పింఛన్లు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం నేటికీ పెంచలేదన్నారు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి 12000 ఇస్తామని చెప్పిన హామీ అమలుకు నోచుకోలేదన్నారు. రైతాంగానికి రైతు భరోసా, రుణ మాఫీ నేటికి పూర్తి కాలేదు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలని లేనియెడల ప్రజా సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు నిర్మిస్తామని హె చ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా అధ్యక్షురాలు తంగిళ్ళ వెంకటచంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యురాలు జూలకంటి విజయలక్ష్మి, మేకన బోయిన సైదమ్మ, జిల్లా నాయకురాలు త్రివేణి, సుందరి రమాదేవి, భాగ్యమ్మ, నారాయణమ్మ పాల్గొన్నారు.