28 August, 2026 | 2:09 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

ఇందిరమ్మ ఇళ్లతోనే పేదల సొంతింటి కల సహకారం

06-04-2026 08:31 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని గోలి లింగాల గ్రామంలో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ బుర్రకాయల రోజా ప్రారంభించారు.ఈ యొక్క కార్యక్రమానికి ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్, మండల ఇన్చార్జి ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంమన్నారు.

అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయితున్నారు. నాగిరెడ్డిపేట్ మండలంలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం త్వరగా పూర్తి కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ బుర్రకాయల రోజా మాట్లాడుతూ...గత టిఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 10 ఏళ్లలో ఏ ఒక్క నిరుపేదకు ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదని, అర్హులందరూ మదన్మోహన్రావు సహకారంతో సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారని తెలిపారు.

అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ... సరైన ఇల్లు లేక అనేక ఎన్నో ఏండ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నామని,కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను అందించి సొంతింటి కలను సహకారం చేసిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ సురేందర్,ఎంపీడీవో ప్రవీణ్ కుమార్,గ్రామ సర్పంచ్ బురకాయల రోజా,కార్యదర్శి సంతోష్ కుమార్,మాజీ సర్పంచ్ శివకుమార్,తదితరులు పాల్గొన్నారు.