6 April, 2026 | 10:19 PM

సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి భూమి పూజ

06-04-2026 08:33 PM

* ముఖ్య అతిథులుగా హాజరైన పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ 57వ డివిజన్ పరిధి అశోక కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీతారామాంజనేయ స్వామి భూమి పూజ కార్యక్రమం చిన్న జీయర్ స్వామి శిష్యులు కుందాల శ్రీనివాసాచార్యులు (యజ్ఞచార్య) కరకములతో సోమవారం జరిగింది. తొలుత అనురాధ నక్షత్ర యుక్త మిధున లగ్న సుమూర్తమున సుదర్శన యజ్ఞాన్ని నిర్వహించి భూమి పూజకు అంకురార్పణ చేశారు.

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నీలిమ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజలో పాల్గొని నవధాన్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. సీతారామాంజనేయ స్వామి నూతన ఆలయానికి భూమి పూజ నిర్వహించడంతో అశోక కాలనీ ఆధ్యాత్మికతకు అలావలంగా మారింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భూమి పూజ తంతులో పాల్గొని ప్రత్యేక పూజలు స్వామివారికి చేశారు. దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చింత శ్రీనివాస్ రావు, ప్రధాన కార్యదర్శి సర్వోత్తమ్ రెడ్డి, అశోక కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మంద కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామచంద్ర రావుతో పాటు భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.