గృహిణి అదృశ్యం
పీఎస్‌లో ఫిర్యాదు చేసిన భర్త
జవహర్ నగర్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): గృహిణి అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత గబ్బిలాల పేటలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన వివరాల ప్రకారం పాత గబ్బిలాల పేట అంబేద్కర్ నగర్‌కు చెందిన బొత్తుల శ్రీనివాస్ భార్య మల్లేశ్వరి (19) దంపతులు గబ్బిలాల పేటలోని శ్రీశ్రీ జ్ఞాన మందిర్ స్కూల్ దగ్గర నివాసమంటున్నారు. ఈనెల 26న మధ్యా హ్నం సమయంలో శ్రీనివాస్ పనిమీద ఇం టి నుండి బయటకు వెళ్లగా ఆ సమయంలో మల్లేశ్వరి ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి తిరిగి రాలేదు.
రాత్రి 11 గంటలకు శ్రీనివాస్ తిరిగి ఇంటికి రాగా భార్య మల్లేశ్వరి కనపడలేదు. ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్కల వెతికిన బంధువుల వద్ద వెతికిన తెలిసిన వారి వద్ద వెతికిన సమాచారం లభించలేదు. ఈ మేరకు శ్రీనివాస్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొ దర్యాప్తు చేపట్టారు.






