జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గృహిణి అదృశ్యం
పీఎస్‌లో ఫిర్యాదు చేసిన సోదరి
జవహర్‌నగర్, జూలై 21 (విజయక్రాంతి): గృహిణి అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేజే నగర్ యాప్రాల్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్‌ఓ సైదులు తెలిపిన వివరాల ప్రకారం యాప్రాల్ జేజే నగర్ ప్రాంతానికి చెందిన శ్రావణి(28) భర్త సుమంత్ తో కలిసి యాప్రాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈనెల 16వ తేదీన సుమంత్ తన భార్యతో గొడవ పెట్టుకుని సొంత ఊరికి వెళ్ళిపోయాడు .
ఈనెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు శ్రావణి నివాసం ఉంటున్న ఇంటికి శ్రావణి చెల్లెలు అనూష వెళ్లి చూడగా తన అక్క శ్రావణి ఇద్దరు పిల్లలు అవినాష్ యశ్వంత్ లు ఇంట్లో కనిపించలేదు. ఈ మేరకు సోదరి అనూష అక్క శ్రావణి పిల్లలు అవినాష్ యశ్వవంతుల గూర్చి చుట్టుపక్కల వెతికినా తెలిసిన వారి వద్ద వెతికినా బంధువుల ఇంట్లో వెతికినా సమాచారం లభించలేదు. ఈ మేరకు అనూష జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






