రోల్ మోడల్‌గా హౌసింగ్ కాలనీ
- 14న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం
- మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
సూర్యాపేట, మార్చి 4 (విజయక్రాంతి)/హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ పట్టణంలోని రామ స్వామి గుట్టవద్ద 110 ఎకరాల్లో నిర్మించిన మోడ ల్ హౌసింగ్ కాలనీని ఈ నెల 14న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మోడల్ హౌసింగ్ కాలనీని అధికారులతో కలసి మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. అనంతరం మీడియా స మావేశంలో మాట్లాడుతూ.. రామస్వామి గుట్ట లో 110 ఎకరాల విస్తీర్ణంలో మోడల్ కాలనీ ని ర్మించబడిందని 2,160 కుటుంబాలకు సింగిల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించనున్నట్లు తెలిపారు.
ఉమ్మ డి ఏపీలో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తాను ఈ ప్రాజెక్టును ప్రారంభించిన విషయా న్ని గుర్తు చేశారు. అనంతరం జరిగిన పరిమాణాలలో 2014లో బీఆర్‌ఎస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తదుపరి ఈ ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైందని ఆయన పేర్కొన్నా రు.
ఈ ప్రాంతాన్ని డంపింగ్ యార్డ్‌గా మార్చారని ప్రజల దీవెనలతో 2023లో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఈ ప్రాజె క్ట్కు కొత్త ఊపిరి పోసిందని మంత్రి తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అత్యంత పేద కుటుం బా లు, గ్రామీణ కూలీలు, రైస్ మిల్ కార్మికులు, హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు సమీప గ్రామాల నివాసితుల కోసం నిర్మించామన్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శ కంగా జరగాలని దృష్టి పెట్టారు.
మొదటి దశలో కేవలం 1,000 మంది లబ్ధిదారులను మాత్రమే ఖరారు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి నరసయ్య, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు
రెడ్లకుంట ప్రాజెక్టు మే చివరికి పూర్తి చేయాలి
రెడ్లకుంట ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు వేగం పెంచాలని, నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడవద్దని మే నెల చివరి వరకు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్‌లను మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. బుధవారం పాలేరు వాగుపై రెడ్లకుంట వద్ద నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. రెడ్లకుంట వద్ద రూ.14 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని,
ఈ పథకం ద్వారా నల్లబండగూడెం, కాపుగల్లు, రెడ్లకుంట పరిధిలో 4,500 ఎకరాలకు సాగునీరు అందుతుంద న్నారు. అలాగే గ్రామాలలో త్రాగునీరు కూడ అందించడం జరుగుతుందని, ప్రాజెక్టు భూసేకరణ నిమిత్తం 3 ఎకరాల 39 కుంటల భూమి సేకరించి రైతులకు రూ.2 కోట్లు చెల్లించామన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ సిఇ రమేష్, ఆర్డిఓ సూర్య నారాయణ పాల్గొన్నారు.




