calender_icon.png 18 February, 2026 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి గుంతలో సమాధి చేసేదెలా?

18-02-2026 12:59:28 AM

క్రైస్తవులకు శ్మశాన వాటిక లేక ఇబ్బంది

కేసముద్రం, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం పట్టణంలో క్రైస్తవులకు ప్రత్యేకంగా శ్మశాన వాటిక లేకపోవడంతో మరణించిన వారిని సమాధి చేయడానికి తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కేసముద్రం మున్సిపాలిటీలో తమ పరిస్థితి పట్టించుకునే వారే కరువయ్యారని క్రైస్తవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక స్థలము లేక శవాన్ని నీటి గుంతలోనే పూడ్చాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. ప్రత్యేకంగా క్రైస్తవు లకు శ్మశాన వాటిక లేకపోవడంతో పట్టణంలోని పెద్దయి చెరువు సమీపంలో మరణిం చిన వారిని సమాధి చేస్తున్నారు. అయితే చెరువులో నీరు అధికంగా ఉన్న సమయంలో మరణించిన వారి పార్థివ దేహాన్ని సమాధి చేయడానికి గొయ్యి తీస్తే అందులో నీళ్లు వస్తున్నాయని, అటువంటి పరిస్థితుల్లో గత్యంతరం లేని విధంగా ఆ నీటి గుంతలోనే సమాధి చేస్తున్నారు.

ఎంతో గొప్పగా కేసముద్రం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఎన్నో ఏళ్లుగా క్రైస్తవుల సామాజిక అవసరా లు మాత్రం తీరడం లేదని క్రైస్తవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికి చెందిన సందిరి ఈశ్వర్ సోమవారం రాత్రి మరణించగా, అతని పార్థివ దేహాన్ని మంగళవారం సమాధి చేయడం కొరకు పెద్దయి చెరువు వ ద్దకు తీసుకొచ్చారు. క్రైస్తవులకు సమాధుల కొరకు ప్రత్యేక స్థలం లేనందున , పెద్దాయి చెరువు మత్తడి దారి పక్కన ఉన్న కొంచెం ఖాళీ స్థలంలో సమాధి చేయడం కోసం గొ య్యి తీశారు. ఇంటి వద్ద నుంచి అతని పా ర్థివ దేహాన్ని సమాధి చేయడం కొరకు తీసుకొని వచ్చేసరికి సమాధి నిండా నీళ్లు వచ్చా యి.

గత్యంతరం లేక వేరే చోట స్థలం లేనందున ఆ నీటిలోని సమాధిని చేయడం జరి గింది. ఈ దయనీయమైన పరిస్థితిని చూసి అక్కడికి వచ్చిన వార్డు కౌన్సిలర్ , బంధువు లు, మిత్రులు, ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా క్రైస్తవులు మా ట్లాడుతూ సమాధుల కోసం స్థలం కేటాయించాలని ఎమ్మార్వో, స్థానిక నాయకుల కు, జిల్లా కలెక్టర్ కు, ప్రతి ఎమ్మెల్యేకు మొరపెట్టుకుంటున్న పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు క్రైస్తవ స్మశాన వాటిక కొరకు స్థలంను కేటాయించి ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమన్నా రు.

గతంలో కూడా ఇలానే చాలా సార్లు జరిగాయని, విషయాన్ని ఎప్పటికప్పుడు నాయ కుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోయిన కానీ క్రైస్తవుల దీనస్థితిని అర్థం చేసు కొని సమస్యను పరిష్కరించిన వారు ఒక్కరు లేరన్నారు. 

ఇప్పటికైనా స్థానిక తహసిల్దార్, కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కార్యవర్గం, క్రైస్తవుల ఈ దీనస్థితిని గమనించి రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని క్రైస్తవుల శ్మశాన వాటిక కొరకు కేటాయించాలని కోరుతున్నారు.