calender_icon.png 9 August, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

09-08-2025 02:47:07 PM

వలిగొండ,(విజయక్రాంతి): 65వ జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం(Youth Congress formation celebration) వలిగొండ మండల(Valigonda Mandal) కేంద్రంలో యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిని వరుణ్ గౌడ్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ భావితరాల నాయకుడిగా ఎదిగేందుకు దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వెంకట్ పాపి రెడ్డి, కొండూరి భాస్కర్, ఐటీపాముల రవి, మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్, కొండూరి సాయి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బుగ్గ ఉదయ్, సెక్రటరీ చిన్నపాక నరేందర్, మండల ఉపాధ్యక్షుడు మనోజ్, మహిపాల్ మండల ప్రధానకార్యదర్శి లోడే శ్రీకాంత్, పట్టణ అధ్యక్షుడు పూసుకూరి లింగం తదితరులు పాల్గొన్నారు.