calender_icon.png 9 August, 2025 | 7:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

09-08-2025 02:57:20 PM

మందమర్రి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అనుబంధ యూత్ కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు యూత్ కాంగ్రెస్ నాయకులు(Youth Congress leaders) ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం యూత్ కాంగ్రెస్ నాయకులు కేకును కోసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్ మాట్లాడుతూ 1960 ఆగస్టు 9న యూత్ కాంగ్రెస్ ఆవిర్భవించిందని నాటి నుండి నేటివరకు యువ నాయకులు సమాజాభి వృద్ధిలో, దేశాభివృద్ధిలో, చురుకైన పాత్ర పోషిస్తున్నారన్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) గెలుపులో యూత్ కాంగ్రెస్ నాయకుల పాత్ర కీలకం అన్నారు. చెన్నూరు నియోజక వర్గ జనరల్ సెక్రెటరీ నేరటి వెంకటేష్ మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కీలక పాత్ర పోషించారని, అంతే కాకుండా యువ నాయకుడు ఎంపీ గడ్డం వంశీ విజయంలో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. రానున్న స్థానిక  ఎన్నికలలో యూత్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపులో ముందుండి పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు జావీద్ ఖాన్, చిప్పకుర్తి శశిధర్, బియ్యపు రవికిరణ్, ఒజ్జ గణేష్, సురేందర్, తౌసిఫ్, సాయి, కిరణ్, మహేష్, సతీష్, చింటూ, సాజన్, తరుణ్, వేణు, రాజేష్, వెంకటేష్, యాసిన్, మణిదీప్, విజయ్, సోహెల్,  బన్నీ  పాల్గొన్నారు.