09-08-2025 02:55:16 PM
మందమర్రి,(విజయక్రాంతి): అన్న చెల్లెల్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్(Raksha Bandhan) వేడుకలు పట్టణంలో మండలంలో శనివారం ఘనంగా నిర్వహించారు. రక్షాబంధన్ ను పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుండి వచ్చిన సోదరీ మణులు తమ సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. సోదర సోదరీ మణులతో పట్టణం లోని కార్మిక కాలనీలు, గ్రామాలు రక్షాబంధన్ వేడుకలతో కళకళ లాడాయి.