09-08-2025 02:50:28 PM
వలిగొండ,(విజయక్రాంతి): ఈనెల 5వ తేదీ లోపు కొత్తగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులు గతంలో దరఖాస్తు చేసుకునే రైతులు ఈనెల 13 వరకు రైతు బీమా(Rythu Bima) కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని అంజనీదేవి తెలిపారు. రైతు బీమా చేసుకునేవారు దరఖాస్తు ఫారం పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, నామిని ఆధార్ జిరాక్స్ జత చేసి సంబంధిత క్లస్టర్ ఏఈఓ లకు అందజేయాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునే రైతుల వయస్సు 18 నుండి 59 మధ్య ఉండాలని తెలిపారు.