calender_icon.png 9 August, 2025 | 6:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిచ్కుందలో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

09-08-2025 02:44:56 PM

బిచ్కుంద, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బిచ్కుంద మండల కేంద్రంలో శనివారం నాడు యువజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవ(Youth Congress Foundation Day) వేడుకలనుఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు కే.విజయ్ భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు.ఆయన మాట్లాడుతూ...యూత్ కాంగ్రెస్ యువతకు ఒక వేదికను అందిస్తుంది, దీని ద్వారా వారు తమ ఆలోచనలను, సమస్యలను వ్యక్తపరచవచ్చు సమాజంలో మార్పు తీసుకురావచ్చు.

కేవలం ఇది ఒక వేడుక కాదు, యువత శక్తిని, సమాజ సేవా నిబద్ధతను దేశాభివృద్ధిలో యువత పాత్రను గుర్తు చేసే ఒక గొప్ప అవకాశం. 1960 చివరలో, భారత ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ ఆలోచనతో మొదలై ఇప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రపంచంలోనే అతిపెద్ద యువజన సంస్థగా దేశ వ్యాప్తంగా సేవలు అందిస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దర్పల్ గంగాధర్ సాయిని అశోక్ మాజీ సర్పంచ్ జీవన్ బిచ్కుంద మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కాళోజీ విఠల్ రావు ముత్తహెర్ మసూద్ ఫయాజ్ అన్వర్ మౌల ఫరూక్ సుభాష్ జూబెర్ సాయి కుమార్ ముబీన్, సుదాకర్, రసూల్, రఫిక్, సంజు, గణేశ్వర్, గౌస్, యాసిన్, రమేష్, నవీన్ లక్ష్మణ్ అశోక్ రూపేష్ నాగ్ నాథ్ లింగం యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.