09-08-2025 02:38:07 PM
తంగళ్ళపల్లి, (విజయక్రాంతి): యవజన కాంగ్రెస్ 65వ ఆవిర్భావ దినోత్సవాన్ని(Youth Congress 65th Anniversary Celebrations) తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నిర్వహించడం జరిగినది. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డిఆదేశాల మేరకు జిల్లా ఇంచార్జ్ తూముకుంట అంశ రెడ్డిఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ, స్వీట్ల పంపిణీ చేయడం జరిగినది. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏగుర్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో 65వ ఆవిర్భవ దినోత్సవ సంబరాలు నిర్వహించడం జరిగినది. ఈ సంబరాల్లో ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగ్ గౌడ్, తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు చుక్కరాజశేఖర్, బస్సాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు పొన్నం ప్రకాష్ గౌడ్ టెక్స్టైల్ పార్కు గ్రామ శాఖ అధ్యక్షుడు బైరవేరు నెలల గ్రామ శాఖ అధ్యక్షుడు కుమార్ లక్ష్మీపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు ప్రశాంత్ రాళ్లపేట గ్రామ అధ్యక్షుడు చందు, అసెంబ్ల, బండి రాజు పయ్యాల కాంగ్రెస్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.