22-04-2025 12:00:00 AM
దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలు పురుషులతోపాటు సమానమేనని భారత రాజ్యాంగం చెబుతోంది. వారికీ సమాన అవకాశాలు కల్పిస్తామని పాలకులూ తరచూ చెప్తుంటారు. కానీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంటున్నదని పై సంస్థ ఈ మేరకు తమ నివేదిక వెల్లడించింది. మగవాళ్ళ అవకాశాలతో పోల్చినప్పుడు స్త్రీలకు కేవలం 68 శాతమే లభిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వివక్ష, శ్రమ దోపిడీసహా ఈ లింగ అసమానతలు స్త్రీల పాలిట శాపాలవుతున్నాయి.
స్త్రీలను రెండవ తరగతి పౌరులుగా గుర్తించే స్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోందని వారు అంటున్నారు. బడిలో చదువుకునే చోట పాఠ్యపుస్తకాలలో లింగ వివక్షపై పాఠ్యాంశాలు చోటు చేసుకున్నాయని పై నివేదిక తెలిపింది. ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వల్ల విద్య, ఆరోగ్యం విషయంలో మహిళల పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. కానీచ ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆశించినంతగా మెరుగు పడలేదు.
ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్టు తేలింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృధి చెందుతున్న, వర్ధమాన దేశాలలో స్త్రీలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో పోటీ పడుతున్నప్పటికీ ఉపాధి, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారు. దేశంలో మహిళల ఆరోగ్యం విషయంలో కేరళ టాప్ ప్లేస్ లో వుండగా, సిక్కిం, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, గోవా, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో వున్నాయి. విద్య, వైద్య, ఆర్థిక రంగాలలో తెలంగాణ 11వ స్థానం స్థానంలో ఉండడం గమనార్హం.
ప్రభుత్వం నూతన విద్యావిధానంలో మహిలపట్ల గౌరవం, వారి సాధికారిత, స్థాయిని పెంచే పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలి. బాల్యదశ నుంచే కుటుంబంలో సమాజంలో మహిళలపట్ల గౌరవం పెంచే చర్యలు తీసుకో వాలి. వారి హ క్కుల రక్షణ, భద్రత చట్టాలమీద మహిళా సంఘాలకు అవగాహన, చైతన్యాలను కలిగించే సదస్సులు నిర్వహించాలి. మహిళా అధ్యయన పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాలి. దేశ రాజకీయాలలో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్స్ ప్రవేశపెట్టి మహిళా నాయకత్వాన్ని ప్రో త్సహించాలి. మానవాభివృద్ధి సాధనలో మహిళాభ్యుదయానికి విధి గా పెద్దపీట వేయాల్సిన అవసరాన్ని అందరం ఇప్పటికైనా గుర్తించాలి.
-నేదునూరి కనకయ్య