calender_icon.png 8 July, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దారితప్పిన మహానాయకుల మార్గం

22-04-2025 12:00:00 AM

ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాల న అంతా మతం, మద్యంపైనే కేంద్రీకృతమై ఉంటున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి న తరువాత మహాత్మాగాంధీ మద్యపాన రహిత దేశంగా భారత్ ఉండాలని ఆశించారు. స్వాతం త్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలు, దార్శనికులు భారతదేశం సోషలిస్టు, సెక్యులర్, ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగాలని ఆశించారు. దీని కోసమే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా తపించారు.

ఈ లక్ష్య సాధన మార్గంలోనే అంబేద్కర్ చదువు అభ్యసించి, అమోఘమైన జ్ఞానం సంపాదించి, రాజ్యాంగం రచించడమే కాక అందరికీ సమన్యాయం చేయాలని ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వం కోసం పాటుపడ్డారు. బౌద్ధ మతాన్ని స్వీకరించి తదనుగుణంగా తన జీవిత లక్ష్యాలను ప్రజలకు తేటతెల్లం చేశారు.

కానీ, ఇటీవలి కాలంలో ముఖ్యంగా గత ఇరవై సంవత్సరాలుగా దేశంలో ఉన్న భిన్నత్వంలో ఏక త్వం అనే భావనకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీ లు, నాయకులు కులం, మతం, ప్రాంతం, భాష వంటి సున్నితమైన అంశాలను వివిధ సందర్భా ల్లో ప్రజలపై రుద్దుతుండడం దురదృష్టకరం. ప్రజల ఓట్లతో అధికారం చేపట్టడుతూ, అదే సందర్భంలో మనీ, మద్యం విపరీతంగా వినియోగిస్తున్నారు.

రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తున్న తీరుతెన్నులు, సంప్రదాయంలో ఈ రకమైన పెనుమార్పు పెరిగింది. దీనికి తోడు కేంద్రం, రాష్ట్రాలు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నాయి. అయినప్పటికీ మరల విచ్చలవిడిగా ఉచిత పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ప్రజలకు అలవికాని హామీలు ఇస్తూ, అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా రాజకీయ నాయకులు పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికలే దీనికి తాజా ఉదాహరణగా చెప్పాలి.

మతానికి అంత ప్రాధాన్యం అవసరమా?

గత దశాబ్ద కాలంగా దేశాన్ని పాలిస్తున్న పాలకులు ఒకే మతానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపి స్తున్నది. అన్ని అంశాలను ఒకే అనే నినాదంతో ముడిపెట్టడం జరుగుతున్నది. దేశంలో పెరుగుతున్న నిత్యావసర ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బ ణం వంటి విషయాలపై ప్రజలు ఆలోచించకుం డా చేస్తున్న గమ్మత్తయిన రాజకీయ క్రీడగా దీనిని అభివర్ణించాలి. ఈ ఉచ్చులో అమాయక ప్రజలు కూడా పడుతుండడం గమనార్హం. మళ్లీ మళ్లీ అలాంటి వారికే అధికారం అప్పగిస్తున్నారు. చా లా రాష్ట్రాలు అపరిమితమైన ఉచిత పథకాలు అ మలు చేస్తూ అప్పుల్లో మునిగి తేలుతున్నాయి.

దీ నికి మన తెలుగు రాష్ట్రాలే చక్కటి ఉదాహరణ. గ త ప్రభుత్వాలు చేసిన అప్పులు తెలిసికూడా, ఎ న్నికల్లో గెలుపే లక్ష్యంగా, అదే పనిగా ఉచిత పథకాలు ప్రకటించి, పాలకపక్షాలు అధికారంలోకి వ చ్చాయి. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఇ చ్చిన హామీలను అమలు చేయడానికి ‘టెంపుల్ టూరిజం’ అంటూ మత పరమైన కార్యక్రమాల కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితిని చూస్తున్నాం. ఇంకోపక్క  మద్యం (లిక్కర్) అమ్మకాలు పెంచ డం, ప్రోత్సహించడం జరుగుతున్నది. పాలకులకు మరోదారి లేని స్థితిలో ఆదాయ సముపా ర్జనకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ దృశ్యం ప్రస్తుతం మన కళ్ళకు కట్టినట్లు కనపడుతున్నది. 

వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఆ దిశగా మన దేశం, రాష్ట్రాలు చేరాలంటే, ఈ రకమైన నినాదాలు సరిపోవని పాలకులు ఇకనైనా గ్రహించాలి. నిర్మాణాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలి. నాణ్యమైన విద్య అందరికీ అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అందించాలి. విద్య, వైద్యంపై దృష్టి సారించాలి. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలి. పారిశ్రామిక రంగానికి ఊతం ఇవ్వాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పరచడానికి కృషి చేయాలి. 

ప్రగతి సాధనే ఏకైక ధ్యేయం కావాలి

ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాలు ప్రపంచ దేశాలను వణికిస్తుంటే, ఒకే ఒక చైనా మాత్రం ససేమిరా అంటూ అగ్రరాజ్యాన్ని హెచ్చరించ గలుగుతుంది. అంటే, దీనికి ప్రధాన కారణం ఆ దేశం సాధించిన అసాధారణ పారిశ్రామిక అభివృద్ధి అని అందరం గ్రహించాలి. ప్రగతి సాధనే ఏకైక ధ్యేయంగా, గొప్ప స్ఫూర్తితో మన దేశం, రాష్ట్రాలు స్వయంసమృద్ధికి పాటుపడాలి. ‘ఆత్మ నిర్భర్ భారత్’ సాధనలో అందరూ నిమగ్నమవ్వాలి.

మతం, మద్యం వైపు ప్రజలను ప్ర యాణింప చేయడం గాకుండా ప్రభుత్వం విద్య వైద్యం ప్రజలకు అందిస్తూ స్వయంఉపాధి అవకాశాలు పొందేలా ప్రయత్నాలు జరగాలి. అపరిమితమైన ఉచిత పథకాలకు స్వస్తి పలకాలి. ప్రస్తుత పాలకులు తరచూ దేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు సందర్శించడమే పనిగా పెట్టుకోవడం సమంజసనీ యం కాదు. 

 -ఐ.పి.రావు