22-04-2025 12:00:00 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే వేల ఉద్యోగాలకు లక్షలా ది మంది యువత క్రమం తప్పకుండా దరఖాస్తు చేసుకుంటున్నా రు. వీరిలో చాలామందికి అవసరమైన అర్హతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగిన వారే ఎక్కువమంది ఉంటున్నారు. కఠినమైన పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి పల్లెటూళ్ల నుంచి రైతు కుటుంబాల యువత నగరాలకు వస్తున్నారు. ఊళ్లలో వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు.
పండించిన రైతుకు నష్టాలు రావడంతో విసుగు చెందిన గ్రామీణ యువకులు తమ పిల్లలకు ప్రభుత్వాలు ఉద్యోగా లు వస్తాయని ఆశతో నగరాల బాట పడుతున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లకు హాజరవుతున్నారు. తీరా పేపర్ లీకులు కావడం, స్వార్థపరులు చేసే అవినీతి కారణం గా పరీక్షలు, నియామకాలు రద్దు కావడం వారు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ప్రభుత్వాలు, నాయకులు, అసాంఘిక శక్తులు నిరుద్యోగుల జీవితాలతో చలగాటం ఆడటాన్ని మానుకోవాలి. అర్హత గల వారికే ఉద్యోగం వచ్చేలా అధికారులు కృషి చేయాలి.
-ఆళవందార్ వేణు మాధవ్, హైదరాబాద్
హిందీపై ఎందుకంత ప్రేమ?
మహారాష్ట్రలో భాజపా నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం పాఠశాలల్లో 1వ తరగతి నుంచి హిందీ బోధన తప్పనిసరి చేసింది. దీంతో ఆ రాష్ట్రంలో రగడ మొదలైంది. హిందీయేతర రాష్ట్రాల్లో ఆ భాషను బలవంతంగా రుద్దుతున్నారన్న వాదం తేటతెల్లం అవుతోంది. ఆ రాష్ట్రంలో హిందీ వాడకం పెరగటంతో మరాఠా భాషాభిమానులు గత కొంత కాలంగా గుర్రుగా ఉన్నారు. మరాఠీ భాషలో సంప్రదాయ పదాలు తొలగిపోయి హిందీ పదాలు చేరుతున్నాయి. దీంతో వారి మాతృభాషకు హిందీవల్ల విఘాతం కలుగుతోందన్న స్పృహ పెరుగుతున్నది. అసలు భాజపా వారికి హిందీమీద ఎందుకంత ప్రేమో అర్థం కావడం లేదు. ఈ రకమైన ధోరణి హిందీయేతర రాష్ట్రాల్లో అలజడికి కారణమవుతోంది.
- కప్పగంతు వెంకట రమణమూర్తి, సికింద్రాబాద్
పిల్లలను కాపాడుకుందాం!
తెలంగాణ ఇంటర్ బోర్డ్ తాజాగా ఫలితాలు ప్రకటించనుంది. 15 నుంచి 17 సంవత్సరాల వయస్సు సహజంగానే దేన్నీ తేలికగా తీసుకోలేరు. తొందరగా ఆవేశానికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఫలితాల విషయంలో భిన్నంగా ఆలోచించి ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉంది. దీనికోసం ముందుగానే సైకాలజీ కౌన్సెలర్స్‌ను నియమించి జీవిత విలువలపై వారికి సరైన అవగాహన కల్పించాలి. 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అయినప్పటికీ ఫలి తం ఏమి లేదనే మార్కుల వలయంలో చిక్కుకొని ఒత్తిడికి లోను కావద్దు. చదువులో వెనుకబడిన వారు, పరీక్షల్లో ఫైయిల్ అయిన వారు, జీవితంలో వృద్ధి చెంద వలసిన వారు.. నిరుత్సాహ పడరాదు. అపజయాన్ని అయినా విజయానికి నాందిగా భావించాలి.
-ఉమాశేషారావు వైద్య, కామారెడ్డి