calender_icon.png 12 September, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీచింగ్, నాన్ టీచింగ్ ఎంతమంది ?

12-09-2025 12:00:00 AM

పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగుల లెక్కతీస్తున్న అధికారులు 

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగుల లెక్క తేల్చేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంత మంది ఉన్నారనే వివరాలు తీస్తున్నారు.

రాష్ట్రంలోని వివిధ శాఖల్లో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఇంకా మంజూరు చేయాల్సిన పోస్టులెన్ని, ఎంత మంది అవసరం లాంటి వివరాలను సేకరించేందుకు గతంలోనే ప్రభుత్వం ఐఏఎస్‌ల కమిటీని నియమించింది. ఈ క్రమంలోనే విద్యాశాఖలోని ఉద్యోగుల లెక్కలను అధికారులు తీసి ప్రభుత్వానికి సమర్పించేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే మూడు నాలుగు రోజుల నుంచి దీనిలో తలమునకలైన అధికారులు...ఉద్యోగుల లెక్కల వివరాలు తీసినట్లు తెలిసింది.