12-09-2025 12:00:00 AM
-ప్రశ్నిస్తే అరెస్టు చేయించడమే ప్రజాపాలనా?
-మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ రమణ
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి) : గ్రూప్ 1 పరీక్షను తిరిగి నిర్వహించాలని రాష్ర్ట వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను నిర్బంధించడాన్ని ఆపాలని అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ రమణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రశ్నిస్తే అరెస్టు చేయించడమే ప్రజాపాలనా? అని ప్రశ్నించారు.
గురువారం తెలంగాణ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడారు. గ్రూప్ అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన హామీలను రాష్ర్ట వ్యాప్తంగా డిస్ ప్లే చేస్తామని తెలిపారు. అలవి గాని హామీలతో కాంగ్రెస్ గత ఎన్నికల్లో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ హయాంలోనే అన్ని కులాలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు.