calender_icon.png 12 September, 2025 | 7:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాకు, ప్రభుత్వానికి మధ్య చిచ్చుపెట్టొద్దు

12-09-2025 12:00:00 AM

-పదేళ్లలో మీరు చేయలేనివి మేం సాధిస్తున్నాం

-మాజీ ఉద్యోగ సంఘాల నేతలకు ఉద్యోగ జేఏసీ విజ్ఞప్తి

-జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): తమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చిచ్చుపెట్టొద్దని మాజీ ఉద్యోగ సంఘ నాయకులకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కా ర్మికుల మిగతా సమస్యలను కూడా రాష్ట్ర ప్ర భుత్వం పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కోరింది.

తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (స్టేట్ లెవల్ )ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యో గ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, నాయకులు దామోదర్‌రెడ్డి, చావ రవి, ముజీబ్ హుస్సే న్, బీ శ్యామ్, ఏ సత్యనారాయణ, కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలి పారు. మిగిలిన పెండింగ్ సమస్యలనూ ప్ర భుత్వం పరిష్కరిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ఉద్యోగ సంఘ నాయకులు గత పదేండ్లలో సాధించలేనివి తాము ఒక్కొక్కటిగా సాధిస్తున్నామని తెలిపారు.

ఉద్యో గుల హక్కులను సాధించేందుకు ప్రభుత్వంతో కొట్లాడటానికి కూడా వెనుకాడబో మని స్పష్టం చేశారు. తమకు ప్రభుత్వం హామీ ఇచ్చిన 15 డిమాండ్లలో ఇప్పటికే కొన్ని సమస్యలను పరిష్కరించిందని, అం దులో ప్రధానమైనదే జాయింట్ స్టాఫ్ కౌ న్సిల్ ఏర్పాటు అని స్పష్టం చేశారు. ప్రభు త్వం తమతో ఇప్పటికే పలుమార్లు చర్చించిందని, తమ సమస్యలను పరిష్కరి స్తుందన్న ధీమా తమకు ఉందని వారు వెల్లడించారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు కటకం రమేశ్, కృష్ణ యాదవ్, డాక్టర్ రామారావు, హరికృష్ణ, సుజాత పాల్గొన్నారు.