18-07-2025 12:52:07 AM
- దశాబ్దాలుగా రోడ్డు, వంతెన కోసం ఎదురు చూపులే...
- జిల్లా కేంద్రానికి కేవలం 17 కిలో మీటర్ల దూరంలో..
- ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని వాగు దాటుతున్న ప్రజలు
అదిలాబాద్, జూలై 17 (విజయక్రాంతి): వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ జిల్లాలోని పలు మారుమూల గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతా యి. జిల్లాలోని పలు గ్రామాలకు వెళ్లే దారు ల్లో వాగులపై వంతెనలు లేకపోవడంతో వాగుకు అవతలిగా ఉన్న గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇలాంటి ఇబ్బందుల్లో ఒకటైన ఉమ్మడి జైనాథ్ మండలంలో నూతనంగా ఏర్పడిన సాత్నాల మం డలం పరిధిలోని పార్డీ (బి) గ్రామం ఒకటి.
వంతెన లేక పార్డీ (బి), పార్డీ (కే), రామయి, మెడిగుడా, కంఠ గ్రామ ప్రజల అవస్థలు అన్నీ ఇన్ని కావు. సాత్నాల ప్రాజెక్ట్ ఏర్పడిన నాటి నుంచి ఈ ఐదు గ్రామాలు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోతాయి. వాగుపై వంతెన నిర్మాణం కోసం దశాబ్దాల కాలంగా అక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్రామానికి వెళ్ళే రహదారి అస్తవ్యస్తంగా ఉండడంతో పాటు వాగుపై వంతెన లేక రాకపోకలకు గ్రామస్తులు నానావస్థలు పడుతున్నారు. జిల్లా కేంద్రానికి, మండల కేంద్రానికి చేరుకోవాలంటే ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని వాగు దాటాల్సిన దుస్థితి నెలకొంది.
శిలాఫలకానికే పరిమితం..
ఎన్నో ఏళ్లు గడుస్తున్న కనీసం గ్రామం నుండి మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేక, వాగు పై వంతెన లేకపోవడంతో పార్డీ (బి), పార్డీ (కే), రామయి గ్రామాల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 17 అప్పటి ఎమ్మెల్యే జోగు రామన్న ఎస్టీ ఎస్‌డీఎఫ్ నిధులు 3 కోట్లతో వంతెన నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇప్పటి వర కు వంతెన నిర్మాణా పనులు మొదలు కాకపోగా, కాగితాలకే పరిమితమయ్యాయి.
అత్యవసర పరిస్థితుల్లో అంతే..
వర్షాకాలంలో వాగు ఉధృతిగా ప్రవహి స్తే అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కేంద్రానికి రావాలంటే దుర్భర పరిస్థితి నెలకొంటుంది. ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకున్నా, గర్భిణీలను ఆసుపత్రికి తీసుకురావాలంటే ఎడ్లబం డి లేదా మంచంపై పడుకోబెట్టి ఎత్తుకోని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగు దా టాల్సి పరిస్థితి నెలకొంది. గతంలో సమయానికి ఆసుపత్రికి చేర్చలేక పలువురి ప్రా ణాలు కోల్పోయినట్లు గ్రామస్తులు తెలిపారు.
జిల్లా కేంద్రానికి కేవలం 17 కిలోమీటర్ల దూరం...
జిల్లా కేంద్రానికి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల పరిస్థితి ఇలా ఉంటే ఇక మారుమూల గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. వర్ష కాలంలో వాగు ఉధృతిగా ప్రవహిస్తే ఈ గ్రామాల ప్రజలు మరో 25 కిలో మీటర్ల దూరం నుండి ప్రయాణం చేసి జిల్లా కేంద్రానికి చేరుకోవాల్సి వస్తోంది.
వర్ష కాలం నేపథ్యంలో ప్రతి సంవత్సరం గ్రామస్తులే స్వచ్ఛందంగా శ్రమదానం చేసి తాత్కాలిక వంతెనను నిర్మించుకొని రాకపోకలు సాగిస్తున్నారు. ఇక వర్షాకాలంలో ఈ వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోతుంది. దీంతో గ్రామస్తులు రెండో దారైన మేడిగూడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా పూర్తిగా గుంతలమయంగా ఉండడంతో రాకపోకలకు అటు గ్రామస్తులకు, పాఠశాలకు వెళ్ళే విద్యార్థులకు ఇబ్బందులు పరిపాటిగా మారాయి.
మా గ్రామం ఏం పాపం చేసింది...
మా గ్రామం ఏం పాపం చేసిందని గ్రామస్తులు తమ గోస వెలిబుచ్చుతున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యేడు సైతం గ్రామస్తులే స్వచ్ఛందంగా శ్రమ దానం చేసి సాత్నాల వాగు మీదుగా తాత్కాలిక వంతెన నిర్మించుకొని రాకపోకలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు కల్లుతెరిచి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
బ్యాంకుకు కూడా వెళ్లలేని పరిస్థితి
గత దశాబ్దా ల కాలంగా వం తెన, రోడ్డు సమ స్య మాత్రం ఎక్క డా వేసిన గొంగ ళి అక్కడే అన్న చందంగా మా రింది. వర్ష కాలంలో రామయి గ్రామం లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు కు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కనీసం మండల కేంద్రానికి వెళ్లడానికి బీటీ రోడ్డు సైతం లేదు. ఇప్పటికైనా ప్ర భుత్వం స్పందించి, గతంలో మంజూరైన వంతెన పనులను చేపట్టాలి.
అశోక్, మాజీ ఉప సర్పంచ్, పార్డీ (బి),