18-07-2025 12:53:20 AM
సదాశివపేట/జడ్చర్ల, జూలై 1౭ (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో గురువారం ఏసీబీ మెరుపుదాడులు చేసిం ది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. యాదాద్రి జిల్లా బీబీనగర్‌లోనూ తనిఖీలు జరిగినట్టు తెలిసింది.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు డాక్యుమెం ట్లు, రికార్డులను పరిశీలించారు. ప్రైవే ట్ డాక్యుమెంట్ రైటర్ల హవా కొనసాగుతుందనే ఫిర్యాదుతోనే ఈ దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. కాగా సదాశివపేట సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో 12 మంది ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ల వద్ద రూ.7,550 నగదు లభించింది.
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రికార్డులు సరిగ్గా నమోదు చేయడం లేదని, నగదు లావాదేవీలకు సం బంధించి తేడాలు కనిపించాయని ఏసీబీ డీఎ స్పీ సుదర్శన్ తెలిపారు. అలాగే డాక్యుమెంట్లపై కొనుగోలుదారుల సెల్‌నెంబర్లు రాయా ల్సి ఉండగా, ప్రైవేట్ డాక్యుమెంట్ల నెంబర్లు రాస్తున్నారని చెప్పారు.
ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయంలోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ఉండకూడదనే నిబంధన ఉందని, తనిఖీ సమయంలో ఎస్‌ఆర్‌వో వద్ద ఇద్దరు ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారని తెలిపారు. కాగా తనిఖీలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
కార్యాలయంలో ఉద్యోగులకు సంబంధించిన హాజ రు రిజిస్ట్‌త్రో పాటు డాక్యుమెంట్లను పరిశీలించినట్టు తెలిసింది. డాక్యుమెంట్లు రూపొందిం చడంలో ఏవైనా అవకతవకలున్నాయా అనే కోణంలో విచారణ చేపట్టిన ట్టు తెలిసింది. సమగ్ర వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలియజేశారు.