ఎంత నీరు.. ఎంత మేలు?
ఎండాకాలం వచ్చింది. ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ సమయంలో శరీరానికి అధికంగా నీరు అవసరం. ఎండ వేడినుంచి తట్టుకోవడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుం ది. శరీరంలో సరైన పరిమాణంలో నీరుంటే ఈ కాలంలో ప్రధానంగా ఎదురయ్యే డీహైడ్రేషన్, వడదెబ్బలను నివారించవచ్చు. నీటి వినియోగాన్ని గుర్తు చేసేందుకు కొన్ని పాఠశాలల్లో వాటర్ బెల్ విధానాన్ని కూడా ఏర్పాటు చేశారు. కేరళలో గతంలో అన్ని పాఠశాలల్లో ఈ విధానాన్ని ప్రభుత్వం అమ లు చేసింది.
మన రాష్ట్రంలోనూ కొన్ని పాఠశాలలు అమలు చేస్తున్నాయి.కొందరు తమ మొబైల్స్‌లో వాటర్ అలారమ్ వినియోగి స్తూ సరైన సమయంలో నీరు తాగే ప్రయ త్నం చేస్తారు. శరీరంలో నీటి నిలువలు పడిపోయినపుడు శరీరం తనంతట తానే తెలి యచేస్తుంది. అదే విధంగా ఒక వ్యక్తి ఎంత నీరు తీసుకోవాలనే అంశంపైనా ఖచ్చితమైన లెక్కలు ఏమీ లేవు. నీటి అవసరాలు వ్యక్తి శరీరతత్వం, వృత్తి, పరిసరాలు, ఆరోగ్య స్థితి, అలవాట్లు, వాతావరణాన్ని అనుసరించి మారుతుంటాయి.
వివిధ పరిశోధనల ప్రకారం ప్రతీ 15 కిలోల శరీర బరువుకు 1 లీటరు నీరు అవసరం. అంటే, 60 కిలోల బరువున్న మనిషికి 4 లీటర్ల నీరు అవసరం. కానీ, ఇందుకోసం మనం 4 లీటర్ల నీరు తాగవలసిన అవసరం లేదు. ఇందులో సగభాగం మనం తినే ఆహారంలోని కూరగాయ లు, పండ్లు, ఆహార పదార్థాల ద్వారా వస్తుం ది.
అంటే, మిగిలిన 2 లీటర్లు తాగితే సరిపోతుంది. ఈ లెక్కన సగటున ప్రతీ ఒక్కరూ రోజుకు 8 గ్లాసుల నీరు తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎండలో కష్టపడే వారు, అథ్లెట్స్, క్రీడాకారులు అధిక మోతాదులో నీటిని వినియోగించాలి.
తక్కువైనా, ఎక్కువైనా కష్టమే
సరైన పరిమాణంలో నీరు తీసుకోకపోతే ఏ విధంగా నష్టం జరుగుతుందో అధికంగా తీసుకున్నా కూడా అదే విధంగా నష్టం జరుగుతుంది. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అన్నట్టు నీరు అధికంగా తీసుకోవడం వల్ల అనేక అనారోగ్యాలు కలగవచ్చు. నీరు అధికంగా ఆధిక్యంతో శరీరంలో సోడియం విలువలు తగ్గిపోతాయి. మెదడు వాపు వచ్చే ప్రమా దం ఉంటుంది. పెద్ద వయసు వారిలో ఇది మరింత ఎక్కువ. అవసరాన్ని మించి నీటిని తీసుకుంటే, ‘వాటర్ ఇంటాక్సికేషన్’ ఏర్పడుతుంది.
ఫలితంగా శరీరంలో లవణాలు, ఎల క్ట్రోలైట్స్ గాఢత తగ్గుతాయి. ఇది ఇతర పర్యవసనాలకూ దారి తీస్తుంది. నీటి ఆధిక్యత శరీరంలో అనేక అవయవాలపై ప్రభావం చూపుతుంది.వికారం, వాంతులు, తలనొప్పి, మానసిక అస్థిరత్వం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతిని అపస్మారక స్థితిలోకి వెళ్లవచ్చు. కండరాలు బిగుసుకోవడం, అలసట, సమన్వయ లోపం వంటివీ సంభవిస్తాయి.
శరీరంలో నీటి నిలువలు ఎక్కువవడం ద్వారా లవణాల శాతం తగ్గడాన్ని ‘హైపోనట్రేమియా’ అంటారు. దీనివల్ల శరీరంలో సోడియం నిలువలు బాగా తగ్గి కణాల్లో నీటి శాతం పెరుగుతుంది. అవయవాలు వాపు చెందుతాయి. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ మారవచ్చు.
అధికంగా నీరు తీసుకో వడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగే అవకాశ మూ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఎంజైమ్స్, హార్మోన్స్ సమతుల్యత దెబ్బ తిని శారీరక క్రియలపై ప్రభావం పడుతుంది. మన శరీర స్థితినిబట్టి తగినంత మాత్రమే నీరు తీసుకోవాలి.
డా.అనుమాండ్ల వేణుగోపాలరెడ్డి






