01-10-2025 01:34:07 PM
హైదరాబాద్: సైబర్ క్రైం పోలీసులకు(Cybercrime Police) హెచ్చరికలు జారీ చేస్తూ ఐబొమ్మ(IBomma ) బుధవారం కీలక ప్రకటన చేసింది. సినిమా, ఓటీటీ పైరసీ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. థియేటర్లలో రికార్డు చేసేవారు, సర్వర్లు హ్యాక్(Servers hacked) చేస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు. దర్యాప్తు క్రమంలో ఐబొమ్మ వెబ్ సైట్ పై పోలీసులు దృష్టిసారించారు. ఐపీలు మార్చి పోలీసులను ఐబొమ్మ పక్కదారి పట్టిస్తోందని పోలీసులు తెలిపారు. చేతనమైతే తమను పట్టుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఐబొమ్మ సవాల్ విసిరింది.
సర్వర్, నేరగాళ్లు పట్టివేతతో తమను అడ్డుకోలేరని ఐబొమ్మ సవాల్ చేసింది. బీహార్, ఉత్తర్ ప్రదేశ్ లో ప్రధాన ఏజెంట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఐబొమ్మ వెబ్ సైట్ ఏజెంట్లను నియమించుకుందని పోలీసులు చెబుతున్నారు. ఓటీటీ కంటెంట్ తస్కరిస్తూ నిర్వాహకులకు ఐబొమ్మ(IBomma challenge) తలనొప్పిగా మారింది. వెబ్‌సైట్‌బ్లాక్ చేస్తే.. మీ ఫోన్ నంబర్లు బయటపెడతామంటూ రెచ్చిపోయింది. ఐదు కోట్ల మందికిపైగా యూజర్ల సమాచారం తమ దగ్గర ఉందంటూ బెదిరింపులకు పాల్పడింది. మీడియా, ఓటీటీ, హీరోలకు షాకింగ్ రివీల్ అవుతుందని, ఇండియా మొత్తం తమకు సపోర్ట్ ఉందంటూ వెనక్కి తగ్గమని ఐ బొమ్మ తేల్చిచెప్పింది. ఐబొమ్మ సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులకు కనపడవని, తమను అడ్డుకోవడం కష్టమేనని, ఆపడం అసాధ్యం... మమ్మల్ని ఆపలేరు.. వెతకలేరంటూ ఐబొమ్మ ప్రకటించింది. తెలంగాణ పోలీసులు(Telangana Police) నాలుగు నెలల దర్యాప్తు తర్వాత దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ నెట్‌వర్క్ ముఠాను అరెస్ట్ చేసింది.