calender_icon.png 25 August, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ మొత్తంలో మావోయిస్టు డంప్ స్వాధీనం

25-08-2025 01:48:51 AM

మెటగూడ ప్రాంతంలో పేలుడు పదార్థాలు

చర్ల, ఆగస్టు 24 (విజయక్రాంతి):  తెలంగాణ చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని మెటగూడ ప్రాంతంలో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.కోబ్రా 203 జిల్లా దళం మరియు సి ఆర్ పి ఎఫ్ సంయుక్త బృందం ద్వారా ఈ ఆపరేషన్ నిర్వహించారు.నిషిద్ధ ఆయుధాలు, బిఎల్ లాంచర్, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. భద్రతా దళాల సిబ్బందికి హాని కలిగించే ఉద్దేశ్యంతో  మావోయిస్టులు ఈ  డంప్ను ఏర్పాటు చేశారు. సైనికులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని సురక్షితంగా క్యాంపు కార్యాలయానికి తిరిగి వచ్చారు.