calender_icon.png 25 August, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటిలో మునిగి యువకుడి మృతి

25-08-2025 01:50:17 AM

చందానగర్ పీఎస్ పరిధిలో విషాదం

శేరిలింగంపల్లి, ఆగస్ట్ 24: చందానగర్ పాపిరెడ్డి కాలనీలో దుర్ఘటన చోటు చేసుకుంది. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద నిలిచి న నీటిలో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గత కొన్ని వారాలుగా అండర్ పాస్లో నీరు తొలగించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదివారం సా యంత్రం యువకుడు ఆ ప్రాంతం గుండా వెళ్తుండగా ప్రమాదవశత్తు నీటిలో జారిపడిపోయాడు. బయటపడక చివరకు ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమో దు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గత 45 రోజులుగా అండర్ పాస్లో నీరు నిలిచినా జిహెచ్‌ఎంసి అధికారులు చర్యలు తీసుకోలేదు. వారి నిర్లక్ష్యమే ఈ ప్రాణ నష్టానికి కారణమని స్థానికులు మండిపడ్డారు.