26-01-2026 11:42:45 PM
పాల్వంచ, జనవరి 26, (విజయక్రాంతి): పాల్వంచలోని ఆదర్శ ఇంటిగ్రేట్ మోడల్ స్కూల్ విద్యార్థులు 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 100 మీటర్ల భారీ జాతీయ పతకంతో వివిధ రకాల దేశ నాయకుల చిత్రపటాలతో నిర్వహించిన ర్యాలీ ఎంతో ఆకర్షణగా నిలిచింది. అనంతరం గణతంత్ర దినోత్సవ గొప్పతనం గురించి పాఠశాల ప్రిన్సిపాల్ రెంటాల నాగభూషణం విద్యార్థులకు వివరించారు. విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు.