27-01-2026 12:00:00 AM
హుజూర్ నగర్, (మఠంపల్లి) జనవరి 26: మఠంపల్లి మండల కేంద్రంలోని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వివాదానికి దారితీశాయి. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ను యాజమాన్యం అవమానించిందని మండల కేంద్రంలో స్థానికులు విమర్శిస్తున్నారు .
రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున నిర్వహించే ఈ వేడుకల్లో రాజ్యాంగం నిర్మాత అయిన అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయకపోవడంపై మండలంలో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.