మానవత్వం చాటుకున్న హుజురాబాద్ ఎమ్మెల్యే
25-04-2024 01:49 AM
రోడ్డు ప్రమాదం బాధితుడికి సహాయం
దగ్గరుండి ఆసుపత్రికి తరలింపు
హుజరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో బుధవారం పలు కార్యక్రమాలకు హాజరయ్యేం దుకు వెళ్తున్న ఎమ్మెల్యే మర్రిపల్లి గూడెం నుంచి కన్నూరుకి వెళ్తున్నారు. మార్గ మధ్యంలో ట్రాక్టర్ ఢీ కొని మధు అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన ఎమ్మెల్యే కాన్వాయ్‌ని ఆపి బాధితు డిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని ఫోన్‌లో వైద్యులకు సూచించారు.






