14-07-2025 12:53:42 AM
జనగామ (మహబూబాబాద్) జులై 13 (విజయ క్రాంతి): భార్య మరణాన్ని తట్టుకోలేక పది రోజులుగా మదన పడుతున్న భర్త భార్య దశదిన ఖర్మ రోజే గుండెపోటుతో మరణించిన ఘటన జనగామ జిల్లా చిల్పూరులో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం చిలుకూరు గ్రామానికి చెందిన సట్ల నరసమ్మ (75) గత పది రోజుల క్రితం మరణించింది.
ఈ క్రమంలో ఆదివారం నరసమ్మ దశదినకర్మ చేయడానికి కుటుంబ సభ్యులతో స్మశాన వాటికకు వెళ్ళిన భర్త చెన్నయ్య (80) అక్కడే కుప్పకూలి పోయాడు. వెంటనే అతన్ని ఇంటికి తీసుకువచ్చి వైద్యున్ని రప్పించి చికిత్స చేయించేందుకు ప్రయత్నిస్తుండగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యుడు దృవీకరించాడు. భార్య చనిపోయిన పదో రోజునే దశదినకర్మ చేసే సమయంలో భర్త చెన్నయ్య మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.