14-07-2025 12:52:29 AM
జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత
గద్వాల, జూలై 13 ( విజయక్రాంతి ) : దేశంలో మైనారిటీలు ఆర్థికంగా,సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సరితమ్మ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తేరుమైనంలో సభాధక్షుడు అతికూర్ రెహమాన్ జరిగిన ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలో ముఖ్య అతిధిగా మాజీ పార్లమెంటు సభ్యురాలు సుభాషిణి అలి , జెడ్పి మాజీ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత, గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ మహ్మద్ రియాజ్ హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుండి ఆవాజ్ కమిటీ రాష్ట్ర మహాసభ గద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. దేశంలో రాష్ట్రంలో మైనార్టీల స్థితిగతులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలు మైనార్టీలపై విచ్చలవిడి దాడులు జరుగుతున్నాయని గోరక్షణ పేరుతో దాడులు వేసి హత్యలు చేస్తున్నారని బుల్డోజర్లతో మైనార్టీ ఇండ్లను కుల్చివేత ఏదేదో సాగుతుందని ప్రభుత్వ యంత్రంగానే సైతం మైనార్టీలపై దాడులను వినియోగించుకుంటున్న సంఘటనలు అనేకంగా జరుగుతున్నాయన్నారు.
ఈ మతోన్మాద సంస్కృతి క్రమంగా తెలంగాణ రాష్ట్రంలో విస్తరిస్తున్నదని మతోన్మాద శక్తుల విషప్రచారం తెలంగాణ ప్రజలు మనసులను కలుషితం చేస్తుందని, మతోన్మాద శక్తులు సృష్టిస్తున్న అపోహాలు, అపార్ధాలను దూరం చేయాలన్నారు మైనార్టీల ప్రజలకు అసత్య విద్వేష ప్రచారాలను ఎండగాడుతూ ప్రజలలో చైతన్యం కలిగించాలని లౌకికవాదాన్ని మతసామరస్య విధానాలను ముందుకు తీసుకువెళ్లాలని,ఆవాజ్ ఈ కృషిని పెద్ద ఎత్తున చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆవాజ్ కమిటీ సభ్యులు మహమ్మద్ అబ్బాస్,జబ్బార్,మధుసూదన్ బాబు,మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ యూసుఫ్,గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు,పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఇసాక్, గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, పెద్దపల్లి అల్వాల రాజశేఖర్ రెడ్డి,గట్టు గౌస్,మా బాషా, కౌసర్ బేగ్,పటేల్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.