14-07-2025 12:53:56 AM
42 శాతం బీసీ రిజర్వేషన్లను ఓర్వలేక పోతుంది బీఆర్‌ఎస్
మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్
వనపర్తి, జూలై 13 ( విజయక్రాంతి ) : బి ఆర్ ఎస్ పార్టీ లో దెయ్యాలు ఉన్నాయని చెప్పినట్లుగా ఒక మంచి మంత్రగాడిని పిలిపించి వెళ్లగొట్టాలని ఆ దెయ్యాలు పోతే ఈ రాష్ట్రం బాగుపడుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ హితువు పలికారు. జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులతో కలిసి మాట్లాడారు.
నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల తమకున్న చిత్తశుద్ధిని చాటుకుని 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలుపరిస్తే అది చూసి ఓర్వలేని బి ఆర్ ఎస్ నాయకులు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. స్వాతంత్య్రం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళితుని ముఖ్యమంత్రి చేయలేదని కెసిఆర్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి ఉంటే తీసివేసి బీసీ మంత్రి ఈటెల రాజేందర్ ని తీసివేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు జడ్పిటిసి లకు ఎంపీటీసీ లకు సర్పంచులకు అందరికీ సమచిత స్థానం కల్పిస్తుందని బీఆర్‌ఎస్ పార్టీలో మంత్రులకు సీఎంను కలవడానికి అవకాశం లేకుండే ఉండేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, బి కృష్ణ మాజీ కౌన్సిలర్స్ బ్రహ్మం చారి శరవంద ఎల్‌ఐసి కృష్ణ ఎస్.కె షఫీ ఓబిసి పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ టీపీసీసీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ మార్కెట్ డైరెక్టర్ లతీఫ్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ డాక్టర్ లతీఫ్ ఎన్ ఎస్ యు ఐ అస్లాం ఇర్ఫాన్ వసీం మన్సూర్ ఆలీ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.