05-11-2025 12:00:00 AM
వనపర్తి టౌన్ నవంబర్ 04:ప్రియునితో కలిసి ఆమె భర్తను హత్య చేసి అనుమానం రాకుండా వనపర్తి పట్టణ పోలీస్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వనపర్తి పట్టణ కేంద్రంలోని పానుగల్ రోడ్డు గణేష్ నగర్ చెందిన నాగమణి,ప్రియుడు శ్రీకాంత్ లను నిందితులుగా గుర్తించామని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
వనపర్తి పట్టణానికి చెందిన నాగమణి ప్రియుడు శ్రీకాంత్ ఆమె భర్తను అక్టోబర్ 25వ తేదీన రాత్రి సమయంలో మద్యంతో మత్తెక్కించి,కూలర్ తాడు సహాయంతో కురుమూర్తిని గొంతు బిగించి హత్య చేసి సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకుని శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో శవాన్ని పడేసి,అనుమానం రాకుండా వనపర్తి పట్టణ పోలీస్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.కానీ పోలీసుల క్షుణ్ణ దర్యాప్తు చేసి టెక్నికల్ సాక్ష్యాలు, సీసీటీవీ ఆధారాలతో నిందితులు దొరికిపోయారు.
నేరం ఎంత చాకచక్యంగా చేసినా నిజం బయటపడుతుందనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు.ఈ కేసు ను 72 గంటల్లోనే కేసు ఛేదించిన వనపర్తి సిఐ బృందం కృషి ఉందన్నారు.ఈ కేసును చేదించడంలో కీలకపాత్ర పోషించిన వనపర్తి సీఐ, కృష్ణయ్య, ఎస్త్స్రలు, పోలీస్ కానిస్టేబుళ్లు ను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందజేశారు.ఈ సమావేశంలో వనపర్తి డిసిఆర్బి డిఎస్పి, ఉమామహేశ్వరరావు, వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.