05-11-2025 12:00:00 AM
రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను
నారాయణపేట.నవంబర్ 4(విజయక్రాంతి) : నారాయణ పేట జిల్లాలోని అన్ని జిన్నింగ్ మిల్లులలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను సూచించారు. తెలంగాణ కాటన్ జిన్నింగ్ మిల్లుల సంఘం ఈ నెల 6 మార్కెట్ యా ర్డులలో మిల్లులు మరియు ప్రైవేట్ కొనుగోళ్లను మూసివేయాలని పిలుపునిచ్చిన నేప థ్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్‌లో నారాయణ పేట జిల్లా లోని జి న్నింగ్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవె న్యూ అదనపు కలెక్టర్ శ్రీను మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 7 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయని, వాటిలో ఇప్పటివరకు 5 మిల్లులలో సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయని, పత్తి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మిగతా 2 మిల్లులలో కూడా కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తిని కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ సీసీఐ సంస్థ ప్రతినిధులను కోరారు.
దీనిపై స్పం దించిన సీసీఐ జిల్లా ప్ర తినిధులు తమ ఉన్నతాధికారుల కు సమాచారం ఇస్తామని, తప్ప నిసరిగా మిగతా రెం డు మిల్లులలో కూడా కొనుగోలు కేంద్రాల ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి వస్తుందని, కపాస్ కిసాన్ యాప్ లో కూడా మొ న్నటి వరకు 12 క్వింటాళ్ల లెక్కనే చూపించిందని, కానీ తాజాగా 12 క్వింటాళ్ల కు బదులు కేవలం 7 క్వింటాళ్ల లెక్క చూపుతోందని ఇది అటు రైతులకు, ఇటు పత్తి రైతులకు సమస్య గా మారిందని మిల్లర్లు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
కొనుగోళ్లలో స్లాట్ బుకింగ్ పద్ధతిని కూడా ఎత్తివేయాలని మిల్లర్లు కోరా రు. స్పందించిన రెవెన్యూ కలెక్టర్ అది కేంద్రం పరిధిలోని వ్యవహారమని ఏమీ చేయలేమని, కానీ ఈ సీజన్ లో కపాస్ కిసా న్ మొబైల్ యాప్, స్లాట్ గురించి జిల్లా రైతులకు అవగాహన కల్పిస్తే, వచ్చే సీజన్ లో రైతులకు స్లాట్ బుకింగ్ ఇంకా సులువు అవుతుందన్నారు.
ఈ స మావేశంలో డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీ త్, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, సిపిఓ యోగానంద్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిని బాలామణి, అగ్నిమాపక శాఖ అధికా రి సురేష్ రెడ్డి, ఎస్.ఐ. గాయత్రి, సీసీఐ ప్రతినిధులు అనూప్ మిశ్రా, శ్రీనివాస్ రావు, మార్కెట్ కార్యదర్శి భారతి, సూపర్ వైజర్ లక్ష్మణ్, మిల్లర్లు శ్రీనివాస్, పవన్ లాహోటీ, తమన్న, రాహుల్ జై, ప్రవీణ్ కుమార్ రెడ్డిపాల్గొన్నారు.