05-11-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మిడ్జిల్, నవంబర్ 4: పత్తి రైతులు పత్తిని ఆరబెట్టుకుని నిర్ణీత తేమశాతం ఉండేలా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బో యి సూచించారు. మంగళవారం ఆమె మిడ్జిల్ మండ లం రాణిపేట గ్రామంలో ఎంఎస్ పద్భనాభ కాట న్ ఇండస్ట్రీస్ సిసిఐ ద్వారా ఏర్పాటుచేసిన ప త్తి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సరైన తేమ శాతం 8 నుండి 12 మధ్య వ చ్చిన వెంటనే సిసిఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయాలని కోరారు..
పత్తిని ఓవర్ లోడ్ లే కుండా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. మంచు కురుస్తున్నందున పత్తిని ఆరబెట్టుకొని పూర్తిగా ఎండిన తర్వాతే కొనుగోలు కేంద్రాలను తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో తహశీల్దార్ పులి రాజు తదితరులు ఉన్నారు.