calender_icon.png 7 July, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరివేసుకొని వృద్ధుడి ఆత్మహత్య

06-07-2025 11:14:05 PM

కుభీర్ (విజయక్రాంతి): మండల కేంద్రం కుభీర్ కు చెందిన నీలకంఠ గోవింద్(64) అనే వృద్ధుడు ఆదివారం తన ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుబీర్ ఎస్సై కృష్ణారెడ్డి(SI Krishna Reddy) తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గోవింద్ కు ఒక్కగానొక కూతురు నర్మదకు 10 సంవత్సరాల క్రితం మండలంలోని చండి గ్రామానికి చెందిన బాలాజీకి ఇచ్చి పెళ్లి చేశాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా కొద్ది రోజుల నుండి కూతురు అల్లుడు కుభీర్ లోనే నివాసముంటున్నారు. అప్పటి నుంచి ప్రతి రోజు కూతురు అల్లుడికి (భార్యాభర్తలు) మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం మామ అల్లుడు గొడవపడ్డారు. ఒక్కగానొక్క కూతురు నర్మదతో భర్త ప్రతిరోజు గొడవపడుతుండడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆదివారం నివాసం ఉంటున్న ఇంట్లోనే ధృలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.